టాయిలెట్‌లో పాత్రల్ని కడగడంపై ఐఆర్‌సీటీసీకి నోటీసు

రైలులోని మరుగుదొడ్డిలో వంటపాత్రల్ని కడగడంపై ఐఆర్‌సీటీసీకి FSSAI సంస్థ నోటీసు జారీ చేసింది. 12223 లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌ ముంబయి- ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో క్యాటరింగ్‌ సిబ్బంది నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలా టాయిలెట్‌లో వంటపాత్రల్ని కడగడం వల్ల ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని, ఆహార భద్రత కోణంలోనూ ఇది అత్యంత అభ్యంతరకరమని FSSAI పేర్కొంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా తమకు సమాధానమివ్వాలని ఐఆర్‌సీటీసీకి సూచించింది.

సంబంధిత పోస్ట్