దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆర్‌జీవీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు అయింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు.

సంబంధిత పోస్ట్