ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలస్తోంది. అయితే రేపు ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్‌ను సిట్ విచారించనుందని సమాచారం. కాగా సిట్‌ ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్