SIDBIలో 68 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి SIDBI శుభవార్త చెప్పింది. గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌), గ్రేడ్‌-బి (మేనేజర్‌) పోస్టుల భర్తీకి 68 ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబర్‌ 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా, డిసెంబర్‌ 11 చివరి తేదీ. డిసెంబర్‌ 27న ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత, వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు వేతనం ఉంటుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం సిడ్బీ అధికారిక వెబ్‌సైట్‌ sidbi.inను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕