తెలంగాణలో భారీ సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పాటు కానున్న సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లకు నూతన నియామక ప్రక్రియ ద్వారా సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.