కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలలో మేనేజ్‌మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 1 సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. NEET UG 2025 అర్హత తప్పనిసరి. గడువు తర్వాత తాత్కాలిక మెరిట్ జాబితా తయారు చేసి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
వెబ్‌సైట్: knruhs.telangana.gov.in