ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. బిహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను సమర్పించవచ్చు. 24 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 26 వరకు గడువు ఉంది. వచ్చే నెల 10వ తేదీన పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

సంబంధిత పోస్ట్