కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI) 110 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి టెన్త్, డిప్లొమా, బీటెక్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం అవసరం. 25-35 ఏళ్ల వయసు గలవారు అర్హులు. జీతం పోస్టును బట్టి రూ.18,000 నుండి రూ.1,42,400 వరకు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)తో పాటు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.