డిజిటల్ చెల్లింపుల భద్రత కోసం NPCI ఐదు కీలక సూచనలు జారీ చేసింది. చెల్లించే ముందు వివరాలు సరిచూడాలి. నమ్మకమైన యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే వాడాలి. పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు. హడావుడిగా లావాదేవీలు చేయకుండా జాగ్రత్తగా పేమెంట్ చేయాలి. ప్రతి లావాదేవీకి అలర్ట్‌లు అందేందుకు SMS, ఈమెయిల్ నోటిఫికేషన్లను ఆన్ చేయాలని సూచించింది. ఇవి మోసాల నుండి రక్షణ కలిగిస్తాయని తెలిపింది.