చిన్నారుల వ్యాక్సిన్ల ధరలను పెంచిన NPPA

నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) చిన్నారులకు వేయాల్సిన ముఖ్యమైన వ్యాక్సిన్ల ధరలను స్వల్పంగా పెంచింది. బీసీజీ టీకా 0.10 డోసు ధర రూ.8.20 నుంచి రూ.9.89గా, రూబెల్లా వ్యాక్సిన్ రేటు రూ.72.90 నుంచి రూ.87.90కు, మీజిల్స్ టీకా ధర రూ.52.40 నుంచి రూ.62 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలకు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని NPPA హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్