ప్రస్తుతం వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' AK 47 చిత్రంలో నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమాలో స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన భారీ షూటింగ్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' సినిమాలో ఎన్టీఆర్ ఓ పాటలో కనిపించారు.