హైదరాబాద్ నగర నడిబొడ్డున అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా, ఈ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని నింపాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంపై కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని, ఒక కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని చాలా మంది ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.