ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో ఎగురుతున్న ఫ్లైట్‌లో హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోందని సమాచారం. ఇది కథలో కీలక మలుపుగా నిలవనుంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో బలమైన ట్విస్ట్‌లతో పాటు, ఈసారి కలర్‌ఫుల్ విజువల్స్‌తో కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రుక్మిణి వసంత్, అనీల్ కపూర్ నటిస్తున్నారు.