ఆసుపత్రి హాస్టల్‌లో నర్సు అనుమానాస్పద మృతి(వీడియో)

AP: ఆసుపత్రి హాస్టల్‌లో నర్సు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని సవేరా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ముదిగుబ్బ గ్రామానికి చెందిన దివ్య, నైట్ షిఫ్ట్ లో డ్యూటీ చేసింది. అయితే డ్యూటీ ముగిశాక హాస్టల్‌కు వెళ్లిన దివ్య చనిపోయి కనిపించింది. దివ్య మృతికి ఆసుపత్రి యాజమాన్యం వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మృతురాలి బంధువులు సవేరా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్