పుట్టిన శిశువు చనిపోయిందని నమ్మించి అమ్మేసిన నర్సు

TG: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాపాన్నపేట(M) లక్ష్మీనగర్‌కు చెందిన నస్రా ఫాతిమా అనే గర్భిణి కోతుల దాడిలో కిందపడి రక్తస్రావం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్‌ తర్వాత ఆడ శిశువు జన్మించగా, పాప చనిపోయిందని నర్సు అక్తరీ బేగం నమ్మించింది. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన ఫాతిమాకు పాప బతికే ఉందని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నర్సు అక్తరీ బేగం పాపను నాసిన్ ఉన్నిసా అనే మధ్యవర్తికి అప్పగించిందని, ఆమె సిద్దిపేటకు చెందిన దంపతులకు రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్