NZ vs IND: పీకల్లోతు కష్టాల్లో భారత్

న్యూజిలాండ్‌ - భారత్ జట్ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్‌లో 334 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా అత్యంత దారుణమైన ఆరంభాన్ని చవిచూసింది. తొలి ఓవర్ ముగిసేసరికి భారత్ ఖాతా తెరవకుండానే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. 7.1 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రుతురాజ్ గైక్వాడ్ కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ క్రీజులో ఉండి జట్టును ఆదుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. భారత్ 31/4 (13)

సంబంధిత పోస్ట్

✕
✕