పిల్లలు మింగే వస్తువులు ప్రాణాలకే ముప్పు: వైద్యుల హెచ్చరిక

చిన్న పిల్లలు, ముఖ్యంగా ఏడాది వయస్సు పైబడినవారు, ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు నాణేలు, గోలీలు, పిన్నులు లేదా బ్యాటరీలు వంటి వస్తువులను నోట్లో పెట్టుకోవడం ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ అనిల్ అరోరా ప్రకారం, బటన్ బ్యాటరీలు, అయస్కాంతాలు, పదునైన వస్తువులు, నాణేలు, గోళీలు అత్యంత ప్రమాదకరమైనవి. పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, ఆగకుండా ఏడవడం, అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. గొంతులో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తే వీపుపై సున్నితంగా తట్టాలి కానీ చేతులతో తీయడానికి ప్రయత్నించకూడదు. ఏదైనా మింగిన 4-6 గంటలలోపు ఆసుపత్రికి తీసుకెళ్లడం ముఖ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్