మహిళా కార్యకర్తలకు అశ్లీల వీడియోలు.. చెప్పుతో కొట్టారు (VIDEO)

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో మహిళా కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ బూత్ అధ్యక్షుడికి శిక్షగా చెప్పుల దెబ్బలు తగిలాయి. గత నెలరోజులుగా అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురిచేశాడని ఆరోపించిన మహిళలు అతడి ఇంటి వద్దకు వెళ్లి చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. మహిళల ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్