హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, బలమైన కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించవచ్చని నిరూపించింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలలో అలరించనుంది. జూన్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, పీకాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.