TG: ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు క్షుద్రపూజలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ మద్దతుదారుడు తొండల రవి ఓడిపోవాలని గుర్తుతెలియని వ్యక్తులు గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈలా, కత్తెర గుర్తుతో ఉన్న స్లిప్ లకు పూజలు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆనవాలు తుడిపించేలా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.