రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖలోని ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణ దశలో ఉన్న ఈ భవనంలో క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. అయితే అక్కడ జరిగింది హోమం పూజలా? క్షుద్రపూజలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పూజలు ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.