యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను విధించడాన్ని మొబైల్ రిటెయిలర్లు వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల తమ ఆదాయానికి గండి పడుతోందని పేర్కొంటున్నారు. ఇందుకు నిరసనగా అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ నిర్వహించనున్నట్లు ఆలిండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఆ రోజు క్యూఆర్ కోడ్లపై నల్లటి వస్త్రం కప్పి ఉంచుతామని, యూపీఐ లావాదేవీలను అనుమతించబోమని స్పష్టం చేసింది.