వన్డే వరల్డ్ కప్-2027 షెడ్యూల్ రిలీజ్

సౌతాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌-2027 షెడ్యూల్‌, గ్రూపులను ఐసీసీ ప్రకటించింది. గ్రూప్‌-Aలో భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, జింబాబ్వే, క్వాలిఫయర్‌-A జట్లు ఉన్నాయి. గ్రూప్‌-Bలో బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌-B జట్లు ఉన్నాయి. టోర్నీ 2027 అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 21 వరకు జరగనుంది. కప్‌ గెలిచే జట్టు గ్రూప్‌ దశలో ఐదు, సూపర్‌ సెవెన్‌లో ఆరు, సెమీఫైనల్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్

✕
✕