వన్డే ప్రపంచకప్-2027కు సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీకి ఇంకా 14 నెలల సమయం ఉన్నప్పటికీ, భారత జట్టు ఎంపికపై అంచనాలు మొదలయ్యాయి. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అంచనా జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్(C), రోహిత్, విరాట్, శ్రేయస్, కేఎల్ రాహుల్ బ్యాటర్లుగా, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ , నితీష్ కుమార్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు చోటు కల్పించారు. బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, కుల్దీప్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంపిక చేశారు.