ఒడిశాలో ప్రతిపక్ష పార్టీలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. బాలాసోర్‌లో ప్రొఫెసర్ వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేపై ఆందోళనకారులు టైర్లు తగలబెట్టారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.