పుణెలో సోషల్ మీడియాలో వచ్చిన మోసపూరిత ప్రకటనను నమ్మి 44 ఏళ్ల కాంట్రాక్టర్ ఒకరు ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఓ మహిళ.. 'తనను గర్భవతిని చేస్తే రూ. 25 లక్షలు ఇస్తానని.. ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ నంబర్‌ను సంప్రదించాలంటూ ఈ వీడియోలో నెంబర్ కూడా షేర్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ ఆశతో డబ్బు పంపాడు. అనంతరం మోసగాళ్లు నంబర్ బ్లాక్ చేయడంతో బాధితుడు బనేర్ PSలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.