ఎర్రవల్లిలో రైతులకు నోటీసులు ఇస్తున్న అధికారులు

TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో రైతులకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సర్వే నం.325లోని భూములకు చెందిన 215 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 4 విడతల్లో సర్వే కొనసాగనుంది. శనివారం 50 మంది రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని సీఎం రేవంత్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕