కొత్త పెన్షన్లు మంజూరు చేసే పేరుతో దరఖాస్తుదారుల నుంచి అధికారులు, స్థానిక నాయకులు అక్రమంగా లంచాలు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కారణాలు చెప్పి పెన్షన్ రాదని భయపెట్టి, రూ.5,000 నుండి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమాలు వరంగల్ జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్, అధికారులు కలిసి ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆదాయ ధృవీకరణ పత్రం కోసం కూడా రెవెన్యూ కార్యాలయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.