ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాకు చెందిన 7 ఏళ్ల రాగిణి.. ఆరు నెలల వయసులో జరిగిన ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయింది. పేదరికంలో ఉన్నప్పటికీ, 1వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి ప్రతిరోజూ 400 మీటర్ల దూరంలో ఉన్న బడికి ఒంటి కాలితోనే గెంతుకుంటూ వెళ్తోంది. స్కూలుకు వెళ్లడానికి పడుతున్న కష్టాలను వివరిస్తూ, తనకు ఒక ట్రై సైకిల్ లేదా కృత్రిమ కాలు ఇప్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా సాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.