అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణాలు. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరడం కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయని నివేదికలు పేర్కొంటున్నాయి.