ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్‌కు ఉందని రష్యా స్పష్టం చేసింది. భారత్-రష్యా చమురు వాణిజ్యం ఇరు దేశాలకు ప్రయోజనకరమని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. ప్రధాని మోదీ రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేసి, అమెరికా, వెనెజువెలా నుంచి సరఫరా చేసుకునేందుకు అంగీకరించారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ, భారత్ రష్యా ఒక్కటే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తుందని, కాబట్టి భారత్ నిర్ణయంలో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు.