పాకిస్థాన్లో డ్రైవర్లెస్ కారును తయారు చేశానంటూ ఓ యువకుడు చేసిన ప్రయత్నం చివరకు నవ్వులపాలైంది. అబాటాబాద్కు చెందిన యువకుడు శాటిలైట్, ఇంటర్నెట్ కనెక్షన్తో కారును నడిపించవచ్చని చెప్పి రిపోర్టర్తో టెస్ట్ డ్రైవ్ చేయించాడు. అయితే కారు అకస్మాత్తుగా అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. నెట్వర్క్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతోనే ప్రమాదం జరిగిందని యువకుడు చెప్పడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.