ఫిబ్రవరి 7న ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, ఆన్లైన్యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీస ప్రాథమిక చార్జీలను నోటిఫై చేయాలని, క్యాబ్ కిలోమీటర్ కు రూ.25 తగ్గకుండా ఫిక్స్ చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల క్యాబ్ ఆటో వాహనాలను నిషేధించాలని డిమాండ్ చేశారు.