AP: విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం రాత్రి పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెడ్డిపల్లిలో సంఘం అప్పలరాజు (72)ని రాము (37) హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.