TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో దారుణం జరిగింది. పెద్దపాపయ్యపల్లి గ్రామ SRSP కాలువ వద్ద ఓ వ్యక్తిని అతికిరాతకంగా హత్య చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్(M) ఉప్పలపల్లికి చెందిన రాకేశ్‌ను అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. పాత కక్షలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.