వర్షంలోనూ వృద్ధుడి యోగాసనాలు.. వీడియో వైరల్‌

వర్షం కురుస్తున్నా.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యోగాసనాలు చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ ఓ బెంచ్‌పై తలకిందలుగా యోగా చేస్తూ అందరి చూపును ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలను రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. వర్షంలోనూ యోగాను ఎంజాయ్‌ చేస్తున్న ఆ వృద్ధుడిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్