పెన్షన్ తీసుకునేందుకు ఓ వృద్ధురాలు పడుతున్న కష్టం చూస్తే ఎలాంటి వారికైనా కన్నీరు తెప్పిస్తుంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో నడవలేని స్థితిలో ఉండి.. పెన్షన్ కోసం కుర్చీ సహాయంతో ఓ వృద్ధురాలు అడుగులేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నడవలేని వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తే.. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.