ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తమ్మిగానిపల్లి గ్రామంలో భూవివాదాల కారణంగా వృద్ధురాలిని స్థానికులు కరెంట్ స్తంభానికి కట్టేశారు. ‘నాకు ఎవరూ లేరు. నన్ను స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెడుతున్నారు’ అంటూ బాధిత వృద్ధురాలు ఏడుస్తున్నా గ్రామస్తులు పట్టించుకోలేదు. కాగా గతంలో రూ.80 వేలు అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే.