భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన లెజెండరీ రెజ్లర్ ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ జీవిత కథ ఆధారంగా 'ఖాషాబా' అనే ప్రతిష్టాత్మక బయోపిక్ తెరకెక్కుతోంది. 'సైరాట్' దర్శకుడు నాగ్‌రాజ్ మంజులే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఖాషాబా స్ఫూర్తిదాయక కథాంశంతో సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో మట్టి కుస్తీ, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.