బంగారంతో ‘ఓం సాయి రామ్‌’.. శిర్డీసాయికి అరుదైన కానుక

దుబాయ్‌కి చెందిన కచ్రూ కుటుంబం శిర్డీ సాయిబాబాకు అరుదైన బంగారు కానుకలను అందించింది. గతంలో 'ఓం సాయి' అని రాసి ఉన్న 270 గ్రాముల బంగారు అక్షరాలను రూ.27 లక్షల విలువతో కానుకగా ఇవ్వగా, తాజాగా 'రామ్‌' అని రాసి ఉన్న 76.3 గ్రాముల బంగారు అక్షరాలను సుమారు రూ.10 లక్షల విలువతో కానుకగా అందజేశారు. అధికారులు ఈ అక్షరాలను ద్వారకామాయిలో బాబా కొలువై ఉన్న గోడపై ప్రతిష్ఠించారు.

సంబంధిత పోస్ట్