బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిరుద్యోగులను ఆకర్షించేందుకు ఎక్స్ వేదికగా ఆదివారం కీలక ప్రకటన చేశారు. 2025-2030 మధ్య కాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలో ఇచ్చిన 50 లక్షల ఉద్యోగాల కల్పన హామీ దాదాపు పూర్తయిందన్నారు.