AP: కర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి ఉత్సవ ఊరేగింపులో ఉద్రికత నెలకొంది. బన్నీ జైత్రయాత్రలో భక్తులు రింగులు తొడిగిన కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లరి మూకలు గాల్లోకి కాగడాలు విసిరారు. కర్రల సమరంలో ఆలూరుకు చెందిన పోతురాజు (28) మృతి చెందారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.