దేశవ్యాప్తంగా లక్షా డెబ్భై వేల మంది గిగ్ వర్కర్స్ సమ్మెలో పాల్గొనడంతో ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా థర్టీ ఫస్ట్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో సమయాన్ని బట్టి సమ్మె కొనసాగింది. డెలివరీ బాయ్స్ కొరత ఏర్పడటంతో, హోటల్స్ తమ సొంత సిబ్బందితో డెలివరీలు చేయించుకోవాల్సి వచ్చింది.