యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూరజ్‌పూర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో స్విమ్మింగ్ పూల్ కోసం గొయ్యి తవ్వుతుండగా, ఒక గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో బాబులాల్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.