ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15ను భారతదేశంలో నవంబర్ 13న రాత్రి 7 గంటలకు విడుదల చేయనుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 7300mAh బ్యాటరీ, 120W ఫ్లాష్ ఛార్జింగ్ తోపాటు పలు ఫీచర్లు ఉన్నాయి. 12GB/16GB RAM, 1TB వరకు స్టోరేజ్ తో రానున్న ఈ ఫోన్ ధర రూ.70 - 75 వేలు ఉండొచ్చని సమాచారం.