ఉల్లిపాయ కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, చుండ్రును నియంత్రించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎముకలు, కంటి ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కిడ్నీ రాళ్ల సమస్యలోనూ ఉపశమనం కలిగించవచ్చు.