భారీగా పెరిగిన ఉల్లి ధర

దీపావళి వేళ ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.70 నుండి రూ.80 వరకు విక్రయిస్తుండగా, హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.50 నుండి రూ.65 మధ్య ధర పలుకుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మార్కెట్లకు సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ధర సెంచరీ దాటవచ్చని వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో ధరల నియంత్రణ కోసం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే ప్రభుత్వం విక్రయిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕