చాలామంది ఉల్లికాడలను కేవలం గార్నిషింగ్ కోసమే వాడతారు, కానీ వాటిలో ఉల్లిగడ్డ కంటే రెట్టింపు పోషకాలున్నాయని వైద్యులు అంటున్నారు. ఇవి గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కారణంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే 'లూటిన్', 'జియాక్సంతిన్' వంటి పోషకాలు కూడా వీటిలో ఉన్నాయి. సలాడ్లు, పప్పులు, వేపుళ్లలో వాడటం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి.