దంపతుల ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

AP: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడి అప్పుల పాలైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. శేషాద్రి (32)కి పోట్లదుర్తి గ్రామానికి చెందిన అంజిత (27)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. శేషాద్రి గత ఎనిమిదేళ్లుగా ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోవడంతో అప్పులు పెరిగిపోగా.. వాటిని తీర్చలేక భార్యాభర్తలిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంజిత తండ్రి గుర్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోస్పాడు ఎస్సై సుధాకర్‌రెడ్డి సోమవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕