ఆన్‌లైన్ బెట్టింగ్స్.. ముగ్గురి సూసైడ్

కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆన్‌లైన్ బెట్టింగ్స్ ముగ్గురి ప్రాణాలు తీశాయి. మైసూరులోని హంచ్యా గ్రామానికి చెందిన జోశి ఆంథోని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడు జోబి ఆంథోని, మరదలు షర్మిల బెట్టింగ్స్ కోసం రూ.80లక్షలు అప్పు చేయడంతో సూసైడ్ చేసుకున్నట్లు ఓ వీడియో తీసి చనిపోయాడు. ఈ వీడియో బయటికి రావడంతో సోదరుడు, మరదలు కూడా సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్